testimony picture

సత్యమేవ జయతే!

- S Satyanarayana Reddy

                  దేవుని నామమునకు స్తోత్రము. నా పేరు సత్యన్నారాయణరెడ్డి. మాది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామము. మా పూర్వీకుల పారంపర్యాచార ప్రకారము విగ్రహారాధన కుటుంబములో పుట్టిన నేను, మా తండ్రిగారి ఉద్యోగరీత్యా ధవిళేశ్వరములో ఉండెడివారము. ఆ గ్రామములోగల గోదావరినది రామ పాదాల రేవులో స్నానం చేసి, సమీపంలో గల అగస్తశ్వీరాలయం, కొండపైనగల లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయంలో అభీషేకాలు అర్చనలు, మరియు ప్రతీ గురువారం సాయిబాబా ఆలయంలో పూజలు కార్తీక మాసంలో చాలా నిష్టగా ఉపవాసాలు ఉంటూ ఆ కార్యక్రమాలన్నిటిని శ్రద్ధగా ఆచరించెడివాడను. ఇలా ఉండగా మా నాన్నగారు అనారోగ్యరీత్యా అనేక హస్పిటల్స్ లో ఉండగా క్త్రెస్తవ సువార్తీకుల ద్వారా క్రీస్తును గురించి వినటం జరిగినది. కాని క్త్రెస్తవ్యం మీద ఉన్న ద్వేషం తో తెలిసిన బ్రహ్మణులను కలిసి ఆయా విషయములు చర్చించినప్పటికి సరియైన సమాధానం లభించక పుస్తకములను ఆశ్రయించటం జరిగినది.
                  స్వామి వివేకానంద ప్రభోదరత్నాకరము మొదటి పేజీలో బ్రహ్మను తెలుసుకోలేం. పరమ పితను మనం తెలుసుకోజాలము. పరమ పుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలోనే క్రీస్తుమూలంగా మాత్రమే బ్రహ్మ సృష్టికర్త ని కాంచగలం అనే సత్యాన్ని మరియు బృహదారణ్య కోప నిషత్తులో దేవుని ఆత్మయే భూలోకంలో పుత్రునిగా జన్మంచి, ఆ కుమారుని ద్వారానే పాపము పరిహరింపబడును. అంతేగాక దివ్యఖురాన్ లో కూడా ఏసుని దేవుని కుమారుడుగాను దైవాత్మ స్వరూపుడుగాను ఉంది. ఆయా గ్రంధాలలో నిక్షిప్తమై ఉన్న ప్రవచన పురుషుడు క్రీస్తు ఏసు. "నా యందు విశ్వాసముంచు ప్రతీవాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి యున్నాను" (యెహను 12.46) , "నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రీ యెద్దకు రాడు"( యెహను 14.6), "పాపములను క్షమించుటకు భూమిమీద మనుష్య కుమారునికి అధికారం కలదు"(మత్తయి 9.6), "అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చెను"( మత్తయి 20.28), "నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కల్గి ఉండును"( యెహను 8.12), అని బోధించి ఆయన తనకు తానుగా ప్రవచనముల ప్రకారము సిలువ బలియజ్ఞమునకు సిద్ధపడి మన పాపముల నిమిత్తము తన రక్తమును సిలువలో చిందించి మనకు పాప విమోచన కలుగ చేసెను. ఈ సత్యాన్ని గ్రహించి అప్పటి నుండి క్త్రెస్తవునిగా కొనసాగుతున్నాను.
                  షాలోమ్ వర్షప్ సెంటర్ పాష్టరు ప్రసాదుగారి వాక్యము ద్వారా మరింత బలపడుతూ దేవునిలో మరిన్ని మేలులు పొందుచున్నాము. మరి ముఖ్యముగా నా ఇద్దరు కుమారులకు 10వ తరగతిలో మంచి ర్యాంకులను వాటి ద్వారా ట్రిపుల్ ఐటీ(IIIT) లలో సీట్లను ప్రభువు అనుగ్రహించారు. అంతేకాక అనేక ఆర్ధిక ఇబ్బందులనుండి దేవుడు నన్ను విడిపించి, చక్కటి ఆరోగ్యముతో ఆశీర్వదించినారు.
                   ఎన్నో మతాలను కలగి ఉన్న మన భారతదేశంలో మహపురుషులు, అవతారమూర్తులు అనబడిన వారు ఎందరో పుట్టారు. వాళ్ళందరి చరిత్ర వారి జీవిత కాలం ముగిసిన తరువాత నే వ్రాయబడినది. కానీ ఆయా ప్రవచనముల ప్రకారము మానవాళి పాప పరిహరార్ధం జన్మించి, తన సొంత రక్తమును చిందించిన పరిశుద్ధుడు క్రీస్తుయేసే. ఇది చదివిన మీరందరు మేము తెలుసుకొనిన ఈ సత్యాన్ని తెలుసు కోవాలని ఆకాంక్షిస్తూ.
                                                                నేటి నీ తీర్మానమే నీ ఆత్మయెక్క నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది సుమా!